- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఫస్ట్ ఫొటో షూట్ అంటూ ఆ పిక్ షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. అప్పుడు భలే ఉన్నావుగా అని కామెంట్స్
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. అయితే రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించింది.
ఇక దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ నలుగురు పిల్లల తల్లిగా, వెంకటేష్ భార్య నటించిందన్న సంగతి తెలిసిందే. ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ 100 మార్కులే ఇచ్చేశారు.
అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో నా ఫస్ట్ షూట్ అంటూ క్యూట్ ఫొటో షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అప్పుడు భలే ఉన్నావుగా అని కామెంట్స్ చేస్తున్నారు.






