తల మీద గాయంతో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. పక్కనే ఉన్న హీరో నవ్వుతుండటంతో షాక్ అవుతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh) ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘డెకాయిట్’(Decoit) ఒకటి.

తల మీద గాయంతో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. పక్కనే ఉన్న హీరో నవ్వుతుండటంతో షాక్ అవుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh) ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘డెకాయిట్’(Decoit) ఒకటి. షానీల్ డియో(Shanil Deo) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక దీనికి సునీల్ నారంగ్(Sunil Narang) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో.. ప్రకాష్ రాజ్(Prakash Raj), సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, అనురాగ్ కశ్యప్, కామాక్షి భాస్కర్ల వంటి ప్రముఖ నటులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తుండ‌గా.. ఇటీవలే విడుదలైన సినిమా పవర్-ప్యాక్డ్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కాగా భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రీసెంట్‌గా నటి మృణాల్ ఠాకూర్ జాయిన్ అయ్యింది. ఈ క్రమంలో ఈ చిన్నదానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఫొటోలో మృణాల్ తలమీద గాయంతో కనిపించింది. ఇక పక్కనే ఉన్న అడివి శేష్ ఆమెకు అయిన గాయం చూపిస్తూ నవ్వుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా అయ్యో పాపం మృణాల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇది ఈ సినిమాలోని ఓ సీన్‌లో భాగంగా ఆమెను అలా మేక్‌ఓవర్ చేసినట్టు పిక్‌ను చూస్తే అర్థం అవుతోంది. Link

Next Story