- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరకట్టులో మహాలక్ష్మిని తలపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. శారీలో ముద్దొస్తున్నావంటూ కామెంట్స్
‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అంతేకాకుండా యూత్ మనసులో క్రష్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన చిత్రాలన్నిటిలో నటించి మెప్పించింది. ఇక అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’(Ala Vaikuntapuramlo) సినిమాలోని ‘బుట్టబొమ్మ’(Butta Bomma) సాంగ్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.
అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించిన ఈ బ్యూటీకి సడెన్‌గా వరుస ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ బిరుదుతో పాటు సినిమా చాన్స్‌లు కరువయ్యాయి. దీంతో కొన్ని నెలలు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఐదు చిత్రాలతో అలరించడానికి మన ముందుకు రానున్నది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో చీరకట్టుకున్న మహాలక్ష్మిలా కనిపించింది. చాలా సింపుల్ లుక్‌లో సూపర్బ్‌గా అనిపించింది. ఇక వాటికి వింటేజ్ గర్ల్ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు నిన్ను ఇలా చీరలో చూస్తుంటే బాగా ముద్దొస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






