- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోకాళ్లపై స్వామి వారి చెంతకు వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్.. నెట్టింట ప్రశంసల జల్లు (వీడియో)
టాలీవుడ్ హీరోయిన్ నందిని రాయ్(Nandini Roy) పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ నందిని రాయ్(Nandini Roy) పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) ‘వారసుడు’ సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss)లో పాల్గొనడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ నెటిజన్లతో ముచ్చటిస్తుంటుంది.
అయితే ఈ అమ్మడు చాలా సార్లు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఒకసారి ఏకంగా మోకాళ్లపై వెళ్లి స్వామి వారిని దర్శించుకుంది. తాజాగా, మరోసారి నందిని అలిపిరి నుంచి తిరుమల కొండపైకి మోకాళ్లపై స్వామివారి చెంతకు వెళ్లి పూజలు చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.






