రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-11 04:00:59  IST  )

హీరోయిన్ ఇషికా దత్త(Ishika Datha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ఇషికా దత్త(Ishika Datha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో నితిన్(Nithin) హీరోగా నటించిన ‘చాణక్యుడు’(Chanakyudu) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ అనుకున్నంతగా స్టార్‌డమ్ తెచ్చకోలేక పోయింది. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసి అక్కడ వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అక్కడ పలు సీరియల్స్ కూడా యాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు వత్సల్ సేథ్‌(Vathsal Seth)ను మ్యారేజ్ చేసుకుంది. అయితే ఇప్పటికే ఈ జంటకు ఓ కుమారుడు ఉండగా.. తాజాగా మరో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఈ బ్యూటీ. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం.. ఇప్పుడు ఫ్యామిలీ సంపూర్ణమైంది.. నాకు కూతురు పుట్టింది’ అని రాసుకొస్తూ ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా ఈ జంటకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story