- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైయ్యాక మరింత గ్లామరస్‌గా తయారయిన టాలీవుడ్ హీరోయిన్.. లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ భామ మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంది. అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఈ అమ్మడు.. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఏమైందో ఏమో కానీ అవకాశాలు రావట్లేదు.
ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే జాకీ భగ్నాని(Jockey Bhagnany)తో ప్రేమలో పడి షికార్లు చేసింది. ఇక గతేడాది అతనితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తన భర్తతో ఎంజాయ్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రకుల్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
అందులో బ్లాక్ కలర్‌లో ఉన్న డ్రెస్ ధరించి నడుము కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అలాగే పోనీ టెల్ వేసుకుని చెవులకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంది. టోటల్‌గా ఈ ఫోటోలు చూస్తే బాగా స్టైలీష్‌గా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక వీటిని షేర్ చేస్తూ. ‘నా కాఫీ కంటే ముదురు రంగులో ఏది ఉందో ఊహించండి? ఇది సరిపోతుంది’ అని బ్లాక్ కలర్ హార్ట్ సింబల్‌ను కూడా జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. ‘సో హాట్ బేబీ’, ‘లుకింగ్ గార్జియస్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.






