terror attack: ఉగ్రదాడిలో మరణించిన కావలి వ్యక్తి ఇంటికి టాలీవుడ్ హీరోయిన్.. ఆపై భావోద్వేగ ట్వీట్

by Chukka Sudharani |

తాజాగా జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో (terror attack) చాలా మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే.

terror attack: ఉగ్రదాడిలో మరణించిన కావలి వ్యక్తి ఇంటికి టాలీవుడ్ హీరోయిన్.. ఆపై భావోద్వేగ ట్వీట్
X

దిశ, సినిమా: తాజాగా జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో (terror attack) చాలా మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ దారుణ ఘటన యావత్ ప్రపంచ దేశాలు అతలాకుతలం చేస్తుంది. దీనిపై సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా.. చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఈ దాడికి పాల్పడిన వారికి సరైన రీతులో శిక్ష పడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

‘పహల్గాం సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈ రోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను. మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని నేను తిసుకోలేకపోతున్నాను.. శ్రీ మధుసూదనరావు (Madhusudhan Rao) గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ భావోద్వేగ ట్వీట్ పెట్టింది. ప్రజెంట్ ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. ‘అందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటే ఇండస్ట్రీ నుంచి నువ్వు ఒక్కదానివే డైరెక్ట్‌గా వెళ్లి వారికి ధైర్యం చెప్పావు. నువ్వు చాలా గ్రేట్.. ఎప్పటికీ నీ వ్యక్తిత్వం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశంసలు కురిపిస్తు్న్నారు. ఇక ఈ ఒక్క విషయంలోనే కాకుండా.. ఎన్నో సార్లు అవసరాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసి ఈ హీరోయిన్ మంచి మనసు ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది.

Next Story