‘పెళ్లయిపోయిందోచ్​’.. అభిమానులను సందేహంలో పడేసిన టాలీవుడ్ హీరో(వీడియో)

by Jakkula.Mamatha |

టాలీవుడ్‌ సీనియర్ హీరో జగపతిబాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

‘పెళ్లయిపోయిందోచ్​’.. అభిమానులను సందేహంలో పడేసిన టాలీవుడ్ హీరో(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ సీనియర్ హీరో జగపతిబాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను దోచేశాడు. అంతేకాదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో అలరించిన ఈ నటుడు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ నటుడు జగపతి బాబు తన కుటుంబంలో జరిగిన ఒక శుభకార్యాన్ని వినూత్నంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన రెండో కుమార్తె వివాహం ఘనంగా జరిగిందని చెబుతూ ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. అయితే ఈ వీడియోను పూర్తిగా ఏఐ సాంకేతికతతో రూపొందించడం విశేషం.

ఈ వీడియోకు “ఇలా మా రెండో అమ్మాయి పెళ్లయిపోయిందోచ్​’ క్యాప్షన్ ఇచ్చాడు. పెళ్లికి సంబంధించిన అసలు ఫొటోలను కానీ, అల్లుడి వివరాలు కానీ బయటపెట్టకుండా కేవలం ఈ క్రియేటివ్ వీడియోతోనే విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీల ఇంట్లో పెళ్లంటే హడావుడి చాలా ఎక్కువగా ఉంటుంది.. కానీ జగపతిబాబు సింపుల్ గా ఇన్ స్టాలో ఆ వీడియో షేర్ చేయడంతో అభిమానులు షాకయ్యారు. ఈ తరుణంలో ఆ వీడియోలో చూపించినట్లు జగపతిబాబు రెండో కూతురు నిజంగానే పెళ్లి చేసుకుందా? లేకపోతే ఆయన సరదాగా ఆ వీడియో షేర్​ చేశారా? అనే చర్చ మొదలైంది. Video

Next Story