- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫకీర్ బాబాగా మారిన టాలీవుడ్ హీరో.. హైప్ పెంచేస్తున్న ‘జాక్’ మూవీ స్పెషల్ పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ఇటీవల ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సినిమాతో వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ఇటీవల ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సినిమాతో వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తెలుసు కదా (telusu kada), జాక్ (jack) వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘జాక్’ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్(Bhaskar) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తోన్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్(Prakash Raj) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ‘జాక్’ నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10వ తేదీన థియేటర్స్‌లోకి రాబోతుంది.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకోవడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. అయితే నేడు రంజాన్ పండుగ కావడంతో ప్రేక్షకులకు విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ ఫకీర్ బాబా కనిపించారు. అంతేకాకుండా ముస్లీం డ్రెస్ ధరించి పొగ వేస్తూ వెళ్తున్నాడు. ఈ పోస్ట్‌కు మేకర్స్ ‘‘జాక్ కేవలం పేరు కాదు. అది ఒక వైబ్. ఇంకా మిస్టరీ బయటపడలేదు’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం సిద్దు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతోంది. కాగా, ఈ సినిమా విడుదల కాకుండానే ఓటీటీ హక్కులు అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు డిజిటల్స్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
#Jack is not just a name…
— BA Raju's Team (@baraju_SuperHit) March 31, 2025
It’s a vibe.
It’s a mystery yet to unfold. 😉
Wishing you all Eid Mubarak from Team #Jack ❤️
A Crackling experience awaits in theatres on April 10th 🔥#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz #AchuRajamani @SamCSmusic @sureshbobbili9… pic.twitter.com/GIa81WgG0B






