టాలీవుడ్ హీరో హోటల్ లో మందుబాబుల రచ్చ !

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ ( Ram Pothineni)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్

టాలీవుడ్ హీరో హోటల్ లో మందుబాబుల రచ్చ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ ( Ram Pothineni)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో.. టాప్ మోస్ట్ హీరో స్థాయికి ఎదిగాడు. అయితే అలాంటి రామ్ కు ఈ మధ్యకాలంలో మంచి హిట్ పడలేదు. దీంతో కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాడు రామ్. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ రామ్... మహేష్ బాబు పి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Thaluka ).

ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతేకాదు తాజాగా రాజమండ్రిలో చిత్రీకరణ కోసం.. హీరో రామ్ కూడా వెళ్లాడట. ఈ తరుణంలో నిన్న సోమవారం రాత్రి... రాజమండ్రిలో హీరో రామ్ ఉంటున్న హోటల్ దగ్గర కొంతమంది యువకులు రచ్చ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పీకలదాకా తాగి.. రామ్ ఉంటున్న ఫైవ్ స్టార్ హోటల్లోకి.. ప్రవేశించారట. అంతేకాదు హీరో రామ్ ఉంటున్న రూమ్ డోర్ కూడా కొట్టారట. దీంతో వెంటనే తన సిబ్బందికి రామ్ సమాచారం ఇచ్చాడు. ఈ తరుణంలోనే ఆయన సిబ్బంది హోటల్ యాజమాన్యం, పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకులను అరెస్టు చేశారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Next Story