ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా ఆడిషన్స్.. అప్లై చేసుకున్న టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2025-02-18 12:20:01.0  )
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా ఆడిషన్స్.. అప్లై చేసుకున్న టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’(Spiri) ఒకటి. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న ఈ మూవీని టీ- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ప్రభాస్, సందీప్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టే ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ‘స్పిరిట్’పై సూపర్ బజ్ క్రియేట్ అయింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు పార్టిసిపేట్ చెయ్యోచ్చు అంటూ ఇటీవల చిత్ర బృందం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేస్తూ.. ‘ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కల్పిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆడిష‌న్స్‌లో పాల్గొన‌వ‌చ్చు. అయితే ఆడిష‌న్స్‌లో పాల్గొనేవారు సినిమా లేదా థియేట‌ర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు అయి ఉండాలి’ అని తెలిపారు.

అలాగే ఆడిషన్‌కు అప్లై చేసుకోవడానికి కావాల్సినవి..

1) ఫొటోలు: మీరు ఏమి తెలియజేయాలనుకుంటున్నారో ఉత్తమంగా సూచించే రెండు ఫొటోలను ఎంచుకోండి. ఉదా.. (వ్యక్తిగత పరిచయం కోసం హెడ్‌షాట్.. ఒక ప్రొఫైల్ షాట్ చిత్రం).

2) పరిచయ వీడియో: మీరు ఎక్కడ ఉన్న 2 నిమిషాల వీడియోను రికార్డ్ చేయండి.

3) మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి (పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారో).

4) మీ నేపథ్యం (విద్య, పని అనుభవం) గురించి కొంచెం పంచుకోండి. [email protected]’ అంటూ మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. అయితే.. దీనిపై తాజాగా మంచు విష్ణు(Manchu Vishnu) రియాక్ట్ అవుతూ.. ‘ప్రభాస్ ‘స్పిరిట్‌’ కాస్టింగ్ కాల్‌(Casting call)కి నేను కూడా అప్లయ్ చేశాను. ఏం జరుగుతుందో చూడాలి’ అంటూ ట్వీట్ పెట్టాడు. ప్రజెంట్ ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed