మళ్లీ తండ్రి కాబోతున్న టాలీవుడ్ ఫేమస్ విలన్.. వైఫ్ బేబీ షవర్ ఫొటోస్ వైరల్

by Gugulothu.Kavitha |

విలన్ క్యారెక్టర్లు పోషిస్తూ మంచి ఫేమ్ తెచ్చుకున్న హరీశ్ ఉత్తమన్(HARISH UTTAMAN) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మళ్లీ తండ్రి కాబోతున్న టాలీవుడ్ ఫేమస్ విలన్.. వైఫ్ బేబీ షవర్ ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: విలన్ క్యారెక్టర్లు పోషిస్తూ మంచి ఫేమ్ తెచ్చుకున్న హరీశ్ ఉత్తమన్(HARISH UTTAMAN) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనిపించడానికి తెలుగు వాడిలా కనిపించే హరీశ్ కేరళకు చెందిన వ్యక్తి. ఆయన తెలుగులో అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. అలా ‘పవర్’(Power), ‘గౌరవం’(Gowravam), ‘శ్రీమంతుడు’(Srimanthudu), ‘దువ్వాడ జగన్నాథం’(DJ), ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’(Krishna gaadi Veeraprema Gadha), ‘ఎక్స్‌ప్రెస్ రాజా’(Express Raja), ‘జై లవకుశ’(Jai Lavakusha), ‘అశ్వద్ధామ’(Ashwathama), ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’(Na peru Surya Naa Illu India), ‘నాంది’(Nandi), ‘కంగువ’(Kanguva) వంటి చిత్రాల్లో విలన్ రోల్ ప్లే చేశాడు.

అంతేకాకుండా ప్రస్తుతం కన్నడ, తమిళ్, మలయాళ వంటి భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. గతంలో అమృత(Amrutha) అనే మేకప్ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకున్న హరీశ్.. పెళ్లైన ఏడాదికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత చిన్న కురువిల్లా(Chinna Kuruvilla) అనే యాక్టర్‌ను ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు ఈ జంటకు.

కాగా చిన్న కురువిల్లా మరోసారి తల్లి కాబోతోంది. అయితే తాజాగా ఆ అమ్మడు బేబీ షవర్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఆ పిక్స్‌ను ఆమె ఇన్‌స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇక ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు హాజరైనట్లు ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం సీమంతం‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సేఫ్ అండ్ హెల్తీ డెలివరీ కావాలని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story