టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంపై టాలీవుడ్ దర్శకధీరుడు పోస్ట్.. ఏమన్నారంటే?

by Kodari Anjali |   (  Updated:2025-05-20 13:17:09  IST  )

అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంపై టాలీవుడ్ దర్శకధీరుడు పోస్ట్.. ఏమన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ నెల (మే) ప్రారంభంలో రిలీజ్ అయిన ఈ చిత్రంలో శశికుమార్ అండ్ సిమ్రన్ కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మే 24 వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే ఈ మూవీపై ప్రముఖ హీరో రజనీకాంత్ అండ్ శివకార్తికేయన్ టూరిస్ట్ ఫ్యామిలీ టీమ్‌ను అభినందించిన విషయం తెలిసిందే. హిట్ టాక్ సంపాదించుకోవడంతో తాజాగా ఈ మూవీపై టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికన పోస్ట్ పెట్టారు. అద్భుతమైన, అద్భుతమైన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ చూశానని పోస్ట్‌లో రాసుకొచ్చారు.

అలాగే హృదయాన్ని కదిలించే మూవీ అని.. చక్కిలిగింతలు పెట్టే హాస్యంతో నిండి ఉందని కొనియాడారు. మొదటి నుంచి చివరి వరకు నేను ఈ చిత్రాన్ని ఆసక్తిగా చూశానని తెలిపారు. అభిషన్ జీవింత్ గొప్పగా రచించి.. దర్శకత్వం వహించారని చెప్పుకొచ్చారు. ఇటీవలి సంవత్సరాలలో అత్యుత్తమ సినిమా అనుభవానికి ధన్యవాదాలు అని ఎవరూ ఈ చిత్రాన్ని మిస్ అవ్వకండి’’ అని జక్కన్న ట్వీట్‌లో వెల్లడించారు.

Next Story