- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sonali Bendre: వర్కింగ్ ఉమెన్స్ హ్యాపీగా ఉండేందుకు 7 బెస్ట్ టిప్స్ చెప్పిన టాలీవుడ్ నటి!
ప్రస్తుత రోజుల్లో చాలా మంది పని ఒత్తిడితో విసిగిపోతున్నారు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ (Working Women) అయితే..ఉదయం లేవగానే ఇంట్లో పని చూసుకోవాలి. అటు పిల్లల్ని రెడీ చేయడం.. మళ్లీ తన వర్క్‌కు వెళ్లడం.. సాయంత్రం ఇంటికొచ్చి ఇంట్లో పనులు సక్కబెట్టడం వంటి బాధ్యతలు ఉంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది పని ఒత్తిడితో విసిగిపోతున్నారు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ (Working Women) అయితే..ఉదయం లేవగానే ఇంట్లో పని చూసుకోవాలి. అటు పిల్లల్ని రెడీ చేయడం.. మళ్లీ తన వర్క్‌కు వెళ్లడం.. సాయంత్రం ఇంటికొచ్చి ఇంట్లో పనులు సక్కబెట్టడం వంటి బాధ్యతలు ఉంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి వీరు ఒత్తిడి(stress)కి లోనవుతుంటారు.
మరీ వర్కింగ్ ఉమెన్స్ ఇబ్బంది పడకుండా.. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సోనాలి (Sonali Brinde) విలువైన సలహాలిచ్చింది. వీటిని ఫాలో అయితే వర్కింగ్ ఉమెన్స్ సంతోషంగా ఉంటారని హీరోయిన్ వెల్లడించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనిషి జీవితంలో కష్టసుఖాలు అనేవి రావడం, పోవడం సాధారణం. కాగా పలుమార్లు కష్టకాలం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాగా ఫలితం ఎలా ఉన్నా.. లైఫ్‌లో ముందుకు సాగాలి. అన్ని మన మంచికే అని భావించాలి. జీవించడంలో మనం చేసే ఏ పనిలో అయినా హ్యాపీనెస్ (Happiness) వెతుక్కోవాలి. ఏ విషయం పట్ల అయినా ఎక్కువగా ఆలోచించకూడదు.
ఓవర్ థింకింగ్ (Overthinking) వల్ల అడుగు ముందుకు వేయలేము. ఇంట్లో పరిస్థితుల్ని ప్రతీ ఒక్కటి అర్థం చేసుకుంటూ పోవాలి. జనరేషన్ తగ్గట్లు మూవ్ ఆన్ అవ్వాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు లవ్ (Self love) చేసుకోవాలి. ముందు ప్రాధాన్యత మీకే ఇచ్చుకోవాలి. అలాగే ఫ్యామిలీతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి. ఎప్పుడూ కూడా మీ టైమ్ వేస్ట్ చేసుకోకూడదని సోనాలి బింద్రె వర్కింగ్ ఉమెన్స్‌కు సలహాలిచ్చింది.
ఇక ఈ నటి అప్పట్లో తెలుగు, హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. 1994 లో ఆగ్ (Aug) అనే హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ ఏకంగా 19 ఏళ్ల వయస్సులోనే సోనాలి ఫెమినా మిస్ ఇండియా పేజీంట్ అవార్డు (Femina Miss India Pageant Award) అందుకుంది. తెలుగులో.. శంకర్ దాదా ఎంబీబీఎస్ (Shankar Dada MBBS), మురారి (Murari), పలనాటి బ్రహ్మానాయుడు (Palanati Brahmanayudu), ఖడ్గం, ఇంద్ర (Indra), ప్రేమికుల రోజు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.






