ట్రెడిషనల్ వేర్‌లో టాలీవుడ్ నటి.. ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నావంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ట్రెడిషనల్ వేర్‌లో టాలీవుడ్ నటి.. ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నావంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇటీవల వచ్చిన అరి వంటి సినిమాల్లో.. కూడా ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. ఇదిలా ఉంటే.. అనసూయ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. తన అభిమానులతో తరచూ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గామారింది.

తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో చీరలో ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ శారీకి మల్టీ కలర్ బ్లౌజ్‌తో పెయిరప్ చేసింది. ఇక పూలు పెట్టుకొని షార్ట్ నెక్లెస్‌ను వేసుకుంది. చెవులకు బుట్టాలు, చేతులకు గాజులు, వేలికి రింగ్, కొప్పు వేసుకుని వాటికి పూలు పెట్టుకుని చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story