Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఏఏ తేదీల్లో పడనుందంటే!!

by Kodari Anjali |   (  Updated:2024-12-14 05:20:53  IST  )

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి బాగా పెరిగిపోతుంది.

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఏఏ తేదీల్లో పడనుందంటే!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి బాగా పెరిగిపోతుంది. బంగాళఖాతంలో అల్పపీడనం నేడు బలహీనపడనుంది. కాగా ఈ నెల(డిసెంబరు) 17, 18 తేదీల్లో రాయలసీమ(Rayalaseema), కోస్తోంధ్రా(kosthandhra)ల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ(Department of Meteorology) వెల్లడించింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేనప్పటికీ.. 16 వ తేదీ నాటికి మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 24 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story