- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'బ్రెయిన్ సర్జరీ చేయించుకుని ఈ రోజుతో వన్ ఇయర్'.. ఆ ఫొటో షేర్ చేస్తూ జూనియర్ సమంత ఎమోషనల్ పోస్ట్
జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అషూ రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అషూ రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్‌లతో కూడా మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఈ భామ చూసే హంగామా అంతా ఇంతా కాదు. దీంతో బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 3లోకి అడుగుపెట్టింది. అక్కడ తన ఆటతీరుతో మంచి మార్కులు కొట్టినప్పటికీ ఫైనల్ వరకు రాలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. అషు రెడ్డి సోషల్ మీడియాలో చూపించే గ్లామర్ డోసు చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అషు తన ఇన్‌స్టా(Instagram)లో బ్లాక్ ఫారెస్ట్ కేక్ పిక్‌ను షేర్ చేసింది.ఇక ఆ కేక్ పై ఫైటర్ అని రాసి ఉండటం విశేషం. ఇక ఈ పిక్‌ను షేర్ చేస్తూ.. ‘ఈ రోజుతో నా బ్రైన్ సర్జరీ అయి వన్ ఇయర్ అవుతుంది. నేను ఆ దేవునికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్యూ గాడ్’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నువ్వు నిజంగానే ఫైటర్‌వి అని కామెంట్స్ చేస్తున్నారు.






