- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏటా యవ్వనంగా కనిపిస్తున్నావ్.. మహేశ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) 50వ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు అట్టహాసంగా వేడుకలను జరుపుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) 50వ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు అట్టహాసంగా వేడుకలను జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సెలబ్రిటీలు అంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేశ్ బర్త్‌డే సందర్భంగా టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘అతడు’ రీ రిలీజ్ కాబోతోంది. ఆ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు ప్రిన్స్ అభిమానులు అర్థరాత్రి నుంచే థియేటర్ల ఎదుట క్యూ కడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), మహేశ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు! తెలుగు సినిమాకు గర్వకారణమైన మీరు, అసాధారణ ప్రతిభ, ఆకర్షణతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం మీరు మరింత యవ్వనంగా కనిపిస్తున్నారు. మీకు సంతోషం, విజయంతో పాటు ఆనందకరమైన క్షణాలతో కూడిన అద్భుతమైన సంవత్సరం కావాలని ఆశిస్తున్నా అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.






