Chennai Love Story: తొలిప్రేమేం అంత తోపుకాదు.. క్యూట్‌గా ఆకట్టుకుంటోన్న ‘చెన్నై లవ్‌స్టోరీ’ గ్లింప్స్

by Chukka Sudharani |   (  Updated:2025-08-01 09:28:07  IST  )

‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ మూవీ రాబోతున్నట్లు తెలిసిందే.

Chennai Love Story: తొలిప్రేమేం అంత తోపుకాదు.. క్యూట్‌గా ఆకట్టుకుంటోన్న ‘చెన్నై లవ్‌స్టోరీ’ గ్లింప్స్
X

దిశ, సినిమా: ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ మూవీ రాబోతున్నట్లు తెలిసిందే. ఇందులో హీరోగా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. హీరోయిన్‌గా శ్రీ గౌరి ప్రియ (Shri Gauri Priya) నటిస్తుండగా.. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.

‘తొలిప్రేమేం తోపుకాదు’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ గ్లింప్స్‌లో.. ‘బేబి సినిమా చూశావా.. మొదటి ప్రేమకు మరణం లేదు.. అది మనసు పొరల్లో శాశ్వతంగా పునాది చేయబడుతుంది. ఫస్ట్ లవ్ గురించి చాలా బాగా రాసుకున్నాడు కదా.. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే అదొక నరకం’ అని హీరోయిన్ డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ గ్లింప్స్‌లో.. ‘మొదటి ప్రేమ ఒక్కటే నిజం అయితే.. అన్ని ప్రేమలు తల్లి ప్రేమతో ఆగిపోవాలి కదండి.. అమ్మే కదా మనందరి ఫస్ట్ లవ్’ అంటూ హీరో చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలుస్తుంది. ‘తొలిప్రేమేం అంత తోపుకాదు’ అనే డైలాగ్‌తో ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ప్రజెంట్ ఈ క్యూట్ గ్లింప్స్ నెట్టింట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Next Story