- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదు నిమిషాలకే ఆ విషయం అర్థమైంది.. యంగ్ హీరో కామెంట్స్ వైరల్
తిరువీర్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘భగవంతుడు’. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పిస్తున్నారు.

దిశ, సినిమా : తిరువీర్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘భగవంతుడు’. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘భగవంతుడు’ సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్ టీజర్ లాంచ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో తిరువీర్.. ‘ఈ కథ విన్న ఐదు నిమిషాలకే ఎంత గొప్ప మూవీ అవుతుంది అనేది అర్థమైంది. ‘భగవంతుడు’ కథకు చాలా బడ్జెట్ అవుతుంది నా మీద అంత బడ్జెట్ పెడతారా అనే సందేహం ఉండేది. కానీ నటుడిగా నువ్వు ఈ కథకు కావాలని చూస్తున్నామని వేణు ఊడుగుల, డైరెక్టర్ గోపి విహారి నాతో చెప్పారు. నాకు డ్యాన్స్ రాదు గోవింద్ గారు డ్యాన్స్ నేర్పించారు. అలాగే మహేశ్ మాస్టర్ డప్పు కొట్టడం నేర్పారు. నన్ను నమ్మండి ‘భగవంతుడు’ చాలా గొప్ప సినిమా అవుతుంది’ ధీమా వ్యక్తం చేశాడు.






