- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త మహాశయులకు విజ్ఞప్తి టికెట్ రేట్ల పెంపుపై కీలక నిర్ణయం
రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. భర్త మహాశయులకు విజ్ఞప్తి.

దిశ, వెబ్‌డెస్క్: రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రతీ పెద్దహీరో సినిమా విడుదలకు టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వాలు జీఓలు ఇస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఆ నిర్ణయం తీసుకుంటున్నాయి. కానీ టికెట్ రేట్ల పెంపు విషయంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల్ని పూర్తిగా అలరించనుందని హామీ ఇస్తోంది. ఈ క్రమంలో పండుగ సీజన్ అయినా టికెట్ ధరలను పెంచబోమని, ఎప్పుడూ ఉండే ధరలకే సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి.. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు. ఇది ప్రేక్షకులకు మరింత చేరువయ్యే మంచి నిర్ణయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో సత్య, సునీల్, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.






