'రీ రిలీజ్ దండయాత్ర' రెడీగా ముగ్గురు స్టార్ హీరోస్ మూవీస్

by Pulgam srinivas |

'రీ రిలీజ్ దండయాత్ర' 'రేసుగుర్రం', 'ఊసరవెల్లి', 'అతిధి' సినిమాలు మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ కానున్నాయి.

రీ రిలీజ్ దండయాత్ర రెడీగా ముగ్గురు స్టార్ హీరోస్ మూవీస్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్యకాలంలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు పెద్ద ఎత్తున ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు నటించిన కొన్ని చిత్రాలు తాజాగా రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.

రేసుగుర్రం

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7 నుంచి 12 తేదీల మధ్య ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించాడు.

ఊసరవెల్లి

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

అతిథి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అమృతా రావు హీరోయిన్‌గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మే 29న రీ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ మూడు చిత్రాలకు కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం.

Next Story