- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Game Changer: 'గేమ్ చేంజర్' సినిమా నిర్మాతలకు, టీమ్‌కు బెదిరింపులు.. చిత్ర బృందం ఏం చేశారంటే?
ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ (Industry)ని పైరసీ పీడిస్తుంది.

దిశ, సినిమా: ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ (Industry)ని పైరసీ పీడిస్తుంది. కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చుచేసి తీస్తున్న గ్లోబల్ రేంజ్ (Global range)లో ఇమేజ్ ఉన్న స్టార్ హీరో సినిమాలు రిలీజ్‌కు ముందే లీక్ అయిపోతూ.. అలాగే రిలీజైనా వెంటనే పైరసీ (piracy) ద్వారా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో మూవీ టీమ్‌కు భారీ ఎత్తున నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే సమస్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినిమా ‘గేమ్ చేంజర్’ కు కూడా ఎదురైంది. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. సంక్రాంతికి స్పెషల్‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా విడుదల రోజే ఆన్‌లైన్‌లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉంది. ‘గేమ్ చేంజర్’ విడుదలకు ముందే నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కొందరికి సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయి. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ (Piracy print leak0 చేస్తామని గొడవకు దిగారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందే చిత్రంలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్‌లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత హెచ్‌డి ప్రింట్ లీక్ చేయడమే కాదు... టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు. అయితే.. దీనిపై స్పందించిన చిత్ర బృందం తాజాగా పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మందిపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి ‘గేమ్ చేంజర్’పై నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.






