నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు బెదిరింపులు.. భారీగా భద్రత పెంపు

by Kema Shiva Kumar |

బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ భద్రతపై సెంట్రల్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు బెదిరింపులు.. భారీగా భద్రత పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ భద్రతపై సెంట్రల్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, ఇటీవల పంజాబీ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్‌తో కౌన్ బనేగా క్రోర్‌పతి ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిగ్ బీ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అమితాబ్‌కు ఖలిస్తానీ సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ (SFJ) నుంచి బెదిరింపులు వచ్చాయి. అదేవిధంగా ఆ సంస్థ చీఫ్ గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్ నవంబర్ 1న ఆస్ట్రేలియాలో జరగనున్న దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను అడ్డుకుంటామని హెచ్చరించాడు. దిల్జిత్ చర్య 1984 యాంటీ-సిక్కు హింసలో మరణించిన వారిని అవమానించినట్లేనని కామెంట్ చేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత 1984 హింసలో బచ్చన్ పాత్ర పోషించాడని SFJ ఆరోపించింది. ఈ పరిణామల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమితాబ్ బచ్చన్ భారీ భద్రతను కల్పించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

Next Story