- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Theatrical release and OTT: ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్ సినిమాలు..
ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి థియేట్రికల్ రిలీజ్ (Theatrical release) అండ్ ఓటీటీ (OTT)లోకి వచ్చేందుకు కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

దిశ, సినిమా: ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి థియేట్రికల్ రిలీజ్ (Theatrical release) అండ్ ఓటీటీ (OTT)లోకి వచ్చేందుకు కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటంటే?
థియేటర్‌లోకి వచ్చే చిత్రాలు..
మజాకా (Majaka): పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్, డైరెక్టర్ త్రినాధరావు కాంబోలో తెరకెక్కిన లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మజాకా’. రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘మన్మధుడు’ ఫేమ్ అన్షు, సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో పాటు ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో భారీ అంచనాల మధ్య శివరాత్రి స్పెషల్‌గా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
తకిట తదిమి తందాన (Takita Tadimi Tandana): ఘన ఆదిత్య, ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘తకిట తదిమి తందాన’. ఎల్లో మాంగో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల నిర్మిస్తున్న ఈ మూవీకి రాజ్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్యూటీఫుల్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకురానుంది.
శబ్దం (Shabdam): తమిళ నటుడు ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబ్దం’. కోలీవుడ్ దర్శకుడు అరివళగన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 15 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘వైశాలి’కి సీక్వెల్‌గా రూపొందింది. లక్ష్మీమీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7G ఫిల్మ్స్ సివా & ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్‌లపై అరివళగన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 28న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
అగాథియా (Agathiya): గీత రచయిత పా.విజయ్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘అగాథియా’. జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. దీనికి ఐసరి గణేష్ నిర్మాత. మార్వెల్ సినిమాల తరహాలో ఓ సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లే ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది.
ఓటీటీ సినిమాలు– వెబ్ సిరీస్‌లు
ఎంఎక్స్ ప్లేయర్
ఆశ్రమ్ 3 (హిందీ సిరీస్) ఫిబ్రవరి 27
అమెజాన్ ప్రైమ్
జిద్దీ గర్ల్స్ (సిరీస్): ఫిబ్రవరి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ (సిరీస్): ఫిబ్రవరి 27
సుజల్2 (వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 28
సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ మూవీ): ఫిబ్రవరి 28
నెట్‌ఫ్లిక్స్
డబ్బా కార్టెల్ (సిరీస్)- ఫిబ్రవరి 28
జియో హాట్‌స్టార్
బీటిల్ జ్యూస్ (హాలీవుడ్): ఫిబ్రవరి 28
ది వాస్ప్ (హాలీవుడ్) : ఫిబ్రవరి 28
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (మలయాళం) : ఫిబ్రవరి 28






