నా లైఫ్‌లో ఎప్పటికీ ఈ సినిమా స్పెషలే.. యంగ్ హీరో ఆసక్తికర కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-12-27 05:26:51  IST  )

యంగ్ హీరో రోషన్(Roshan Meka), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'(Champion).

నా లైఫ్‌లో ఎప్పటికీ ఈ సినిమా స్పెషలే.. యంగ్ హీరో ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో రోషన్(Roshan Meka), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'(Champion). ప్రదీప్ అద్వైత్(Pradeep Adhwaith) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ నిన్న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో హీరో రోషన్ మేక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘ మీడియా అందరికీ థాంక్యూ సో మచ్. ఛాంపియన్ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ ప్రాజెక్టుకి నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను. స్వప్న అక్క నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. తనకి సినిమా అంటే చాలా పాషన్ సినిమా కోసం ఏమైనా చేస్తుంది. కిరణ్ గారికి థాంక్యూ, అలాగే జీకే గారికి, మా నిర్మాతలు అందరికీ థాంక్యూ సో మచ్. కళ్యాణ్ చక్రవర్తి గారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పటినుంచి ఆయన నటన కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన మాకు ఒక ఇన్స్పిరేషన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను, మిక్కీ గారు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు.

ఆయన పాటలే చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్లాయి. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అనస్వర చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. తనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఉంది. ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఛాంపియన్ ఎప్పటికీ నాకు స్పెషల్ ఫిలిం. నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్యూ. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా నా లైఫ్‌లోనే స్పెషల్. ఇది ఫ్యామిలీ మూవీ.. అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను’ అని రోషన్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story