నేను మ్యారేజ్ చేసుకోకపోవడానికి రీజన్ ఇదే.. కోవై సరళ షాకింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ లేడీ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నేను మ్యారేజ్ చేసుకోకపోవడానికి రీజన్ ఇదే.. కోవై సరళ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ లేడీ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రహ్మానందంతో ఆమె చేసే కామెడీతో కడుపుబ్బా నవ్వించేది. సినీ రంగంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. నిజ జీవితంలో మాత్రం ఊహించని ఇబ్బందులను, అవాంతరాలను ఎదుర్కొంది. దీనికి తోడు ఆమె వయసు వారంతా పెళ్లిళ్లు చేసుకొని, వారి పిల్లలకు కూడా పెళ్లిళ్లు చేస్తుంటే .. కోవై సరళ మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ కోవై సరళ తాను ఇప్పటి వరకు మ్యారేజ్ చేసుకోకపోడానికి గల కారణాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని కండీషన్ లేదు కదా. స్వేచ్ఛ కోసమే చేసుకోలేదు. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. ఆ తర్వాత ఈ బంధాలన్నీ వచ్చాయి. ఎంతోమంది పిల్లలు ఉన్న వాళ్లు కూడా చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని ఒకరు చూడాలని ఎప్పుడూ అనుకోకూడదు. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. సింగిల్ లైఫ్ ఈస్ ద బెస్ట్ లైఫ్’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story