మహాలక్ష్మిని తలపిస్తున్న తెలుగు హీరోయిన్.. మల్లెపూలతో దర్శనమివ్వడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే..

by I. Sairam |   (  Updated:2025-08-09 05:23:04  IST  )

యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మహాలక్ష్మిని తలపిస్తున్న తెలుగు హీరోయిన్.. మల్లెపూలతో దర్శనమివ్వడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’(Software Devoloper) వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీకి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అలా ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) సరసన ‘బేబీ’(Baby) మూవీలో నటించి తన యాక్టింగ్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ సరసన ఓ మూవీలో యాక్ట్ చేస్తోంది. అయితే వైష్ణవి చైతన్య సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వైష్ణవి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ చీరలో, స్లీవ్‌లెస్ట్ బ్లౌజ్ వేసేకుని కనిపించింది. చేతులకు మ్యాచింగ్ బ్యాంగిల్స్, నక్లెస్, ఇయర్ రింగ్స్, మల్లెపూలు పెట్టుకుని ట్రెడిషనల్‌గా రెడీ అయింది. ఇక ఈ ఫొటోస్‌క గ్రేస్ ఇన్ ట్రెడిషన్ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మహాలక్ష్మిలా ఉన్నావు. మల్లె పూలు పెట్టుకోవడంతో తెలుగుదనం ఉట్టిపడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story