Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ వెన్నులో విరిగిన కత్తి ఇదే.. వైరల్ అవుతున్న ఫోటో

by Phanindra |   (  Updated:2025-01-19 11:33:03  IST  )

ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ వెన్నులో విరిగిన కత్తి ఇదే.. వైరల్ అవుతున్న ఫోటో
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై ( Saif Ali Khan ) దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఇంట్లోకి దూరి దొంగతనం చేయబోతుంటే.. ఆ టైం లో మేల్కొని ఉన్న సైఫ్ అతడిని వెంబడించగా, దొంగ కత్తితో ( knife) సైఫ్‌ మీద దాడి చేశాడు.

అయితే, సైఫ్ ను పొడిచిన కత్తిని నేడు వైద్యులు మీడియాకు చూపించగా.. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి . చూడబోతుంటే కత్తి పెద్దదిగానే ఉందని తెలుస్తోంది. ఇది సుమారు 2.5 అంగుళాల పొడవు ఉంటుంది. ఇంకో అంగుళం లోతుగా దిగుంటే సైఫ్ పరిస్థితి సైఫ్ మరింత సీరియస్ అయ్యేదని అంటున్నారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు మీడియాకు వెల్లడించారు. ఈ కత్తిని చూసిన నెటిజన్స్ " వామ్మో అతనేం చేశాడని ఇంతకీ దిగజారావ్" అని ఆ దొంగని తిట్టిపోస్తున్నారు. మరో వైపు సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Next Story