- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sobitha Dhulipala: ఇది మాకు ఎంతో గొప్ప విషయం ఆనందంగా ఉంది.. అక్కినేని కోడలు పోస్ట్
యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobitha Dhulipala) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటించి మంచి గుర్తింపు సంపాందించుకుంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobitha Dhulipala) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటించి మంచి గుర్తింపు సంపాందించుకుంది. ఇక అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. డిసెంబర్‌లో వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇక అప్పటి నుంచి శోభిత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇంట్లోనే ఉంటుంది. ఇక నాగచైతన్య మాత్రం పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే ‘తండేల్’ షూటింగ్‌లో పాల్గొన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
అలాగే భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. నాగచైతన్య ఫ్యామిలీతో పాటు నరేంద్ర మోడీ(Narendra Modi)ని కలిశారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిళ, నాగసుశీల(Naga Susheela) సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. అయితే శత జయంతి జరుపుకున్న భారత సినీ ప్రముఖుల గురించి మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ క్రమంలో రాజ్ కపూర్, ఏఎన్నార్ వంటి వారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఏఎన్నార్ గురించి మోదీ మాట్లాడటంతో అక్కినేని ఫ్యామిలీ ఎంతో సంతోషించింది.
ఇక ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు శాలువాతో సత్కరించి ఓ ప్రత్యేక బహుమతిని కూడా ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ శోభిత ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘పార్లమెంట్ హౌస్‌లో ఈ రోజు జరిగిన సమావేశానికి గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీకి ప్రగాఢ కృతజ్ఞతలు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ‘అక్కినేని క విరాట్ వ్యక్తిత్వ’ను అందించడం. ANR గారి సినీ వారసత్వానికి నివాళి. అతని జీవితపు పనికి మీరు చేసిన గుర్తింపు మా కుటుంబానికి, అభిమానులకు, ఇది ఎంతో గొప్ప విషయం చాలా ఆనందంగా ఉంది’’ అని రాసుకొచ్చింది. అలాగే ప్రధానికి బహుమతి ఇచ్చిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు తెలుగు అమ్మాయిలా ఉన్నావని కామెంట్లు చేస్తు్న్నారు.






