ఈ అందమైన అమ్మాయి దగ్గర ఆసక్తికరమైన అప్‌డేట్ ఉంది.. ఏంటో గెస్ చేయండంటూ అనుపమ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by I. Sairam |

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ అందమైన అమ్మాయి దగ్గర ఆసక్తికరమైన అప్‌డేట్ ఉంది.. ఏంటో గెస్ చేయండంటూ అనుపమ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మనుపెన్నడు కనిపించని గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లును ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(JSK), ‘పరదా’(Paradha), బైసన్(Bison),పెట్ డిటెక్టివ్(Pet Detective), బిఎస్ఎస్-11(BSS-11) వంటి సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా అనుపమ తన ఇన్‌‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో లంగా వోణి కట్టుకొని, రెండు జడలు వేసుకుని, మల్లెపూలు పెట్టుకుని, మెడలో నక్లెస్ ముక్కుకు ముక్కెర, పాపిట పిల్ల పెట్టుకుని అచ్చ తెలుగు అమ్మాయిలా రెడీ అయ్యింది. ఇక క్యూట్ స్మైల్ ఇస్తూ.. ‘ఈ అందమైన అమ్మాయి దగ్గర ఆసక్తికరమైన అప్‌డేట్ ఉంది.. ఏంటో గెస్ చేయండి’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది తాను నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ కావచ్చు లేదా సాంగ్ అప్డేట్ అయి ఉండొచ్చు అని ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story