- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rishi Kapoor: తండ్రి అప్పులు తీర్చేందుకు సినిమాల్లోకి వచ్చాడు.. సీన్ కట్ చేస్తే ఫస్ట్ మూవీకే సూపర్ స్టార్
Rishi Kapoor: రిషి కపూర్(Rishi Kapoor), బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా మొదలై, క్యాన్సర్‌తో పోరాడి 2020లో కన్నుమూశాడు.

దిశ, వెబ్‌డెస్క్: Rishi Kapoor: రిషి కపూర్(Rishi Kapoor), బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా మొదలై, క్యాన్సర్‌తో పోరాడి 2020లో కన్నుమూశాడు. అతని సినిమాలు, బంధాలు చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఆయన జీవితంలో మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.
రిషి కపూర్, బాలీవుడ్ లెజెండరీ నటుడు. తన తండ్రి రాజ్ కపూర్(Raj Kapoor) కుమారుడిగా 1970లో మేరా నామ్ జోకర్ చిత్రంలో బాలనటుడిగా పరిచయమయ్యాడు. అయితే, ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఫలితంగా, రాజ్ కపూర్ భారీ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాడు. ఆ అప్పును తీర్చడానికి, రిషి 1973లో తన తండ్రి దర్శకత్వం వహించిన బాబీ(Bobby) చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో రాజ్ కపూర్ ఆర్థికంగా కోలుకున్నారు.
ప్రేమ, కుటుంబం, కెరీర్:
రిషి కపూర్ తన సహనటి నీతూ సింగ్‌తో 12 సినిమాల్లో కలిసి నటించాడు. వీరిద్దరూ ప్రేమలో పడి 1980లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కుమార్తె రిద్ధిమా కపూర్, కుమారుడు రణబీర్ కపూర్. రణబీర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు.
రిషి తన కుమారుడితో అంతగా సన్నిహితంగా ఉండలేకపోయినప్పటికీ, తండ్రి-కొడుకుల మధ్య ఒక ఎమోషనల్ డిస్టెన్స్ ఉందని అంగీకరించాడు. తన ఆత్మకథ ఖుల్లం ఖుల్లా: రిషి కపూర్ అన్‌సెన్సార్డ్ లో, "నేను నా కొడుకుతో బంధాన్ని మిస్ అవుతున్నాను" అని వెల్లడించాడు.
కొత్త ప్రయాణం:
25 సంవత్సరాలపాటు రొమాంటిక్ హీరోగా కొనసాగిన రిషి, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి కొత్త నటుల రాకతో సినిమాలు వదిలేయాలని అనుకున్నాడు. కానీ, తనను తాను కొత్త తరహా పాత్రల్లో మలుచుకుని, 2020 వరకు నటించేందుకు ముందుకు వచ్చాడు.
ఆరోగ్యం, చివరి రోజులు:
2018లో రిషి కపూర్‌కు లుకేమియా (Blood Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లి, సంవత్సరం తర్వాత తిరిగి భారత్ వచ్చాడు. అయితే, 2020లో ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో, ఏప్రిల్ 29న ఆసుపత్రిలో చేర్చారు. చివరకు, ఏప్రిల్ 30, 2020న ముంబయిలో ఆయన కన్నుమూశాడు.






