ప్రమోషన్స్‌లో జోరు పెంచిన ఘాటీ టీమ్.. ఆకట్టుకుంటోన్న మూడో సాంగ్

by Chukka Sudharani |   (  Updated:2025-08-30 14:45:41  IST  )

లాంగ్ గ్యాప్ తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనుష్క శెట్టి.. త్వరలో ‘ఘాటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.

ప్రమోషన్స్‌లో జోరు పెంచిన ఘాటీ టీమ్.. ఆకట్టుకుంటోన్న మూడో సాంగ్
X

దిశ, సినిమా: లాంగ్ గ్యాప్ తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనుష్క శెట్టి.. త్వరలో ‘ఘాటీ’ (Ghaati) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. కృష్ణ జాగర్లమూడి డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మూవీ.. ఈసారి అదిరిపోయే యాక్షన్ డ్రామాను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నది. సెప్టెంబర్ 5న ఘాటి గ్రాండ్‌గా రిలీజ్ కానుండగా.. రీసెంట్‌గా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. మొత్తం 2 గంటల 37 నిమిషాల రన్‌ టైంతో థియేటర్లోకి రాబోతోంది ఘాటీ. అలాగే ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు కూడా మూవీపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే.. రిలీజ్ సమయం దగ్గర పడుతుండగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి రెండు పాటలు రాగా.. తాజాగా మూడో పాటను కూడా రిలీజ్ చేస్తూ ఓ పోస్టర్ షేర్ చేశారు. ‘శీలవతి, దేశి రాజు.. వారి ప్రేమ ప్రత్యేకమైనది. ఘాటీ మూడవ సింగిల్ ‘సిరిమారా సిరిమారా’ (SirimaraSirimara) మీ అందరికి ఆకట్టుకోనుంది’ రిలీజ్ చేసిన పోస్టర్‌లో అనుష్క అండ్ విక్రమ్ ప్రభు లుక్ క్యూట్‌గా ఆకట్టుకుంటుంది. లింక్


Next Story