- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తండేల్’ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న హైలెస్సో హైలెస్సా లిరిక్స్(వీడియో
యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తండేల్’(Thandel).

దిశ, సినిమా: యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్(Geetha Arts) బ్యానర్‌పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, మొదటి రెండు పాటలు బుజ్జి తల్లి, నమో నమః శివాయకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా, ‘తండేల్’ థర్డ్ పాటను మేకర్స్ విడుదల చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సా సాంగ్ లిరికల్ వీడియోతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. ఇందులో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ ని, ఎదురుచూపులని, నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న అనురాగాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. వండర్ ఫుల్ మోలోడీస్ ని కంపోజ్ చేయడంలో మాస్టర్ అయిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్, హృదయాన్ని తాకే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశారు. శ్రీ మణి లిరిక్స్ విడదీయరాని ప్రేమని చాలా గొప్ప ప్రెజంట్ చేశాయి.






