Thandel: తండేల్ నుంచి ‘హైలెస్సో.. హైలెస్సా’.. మరో క్రేజీ సాంగ్‌తో వచ్చేస్తున్న నాగచైతన్య, సాయిపల్లవి

by Chukka Sudharani |

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ (Thandel).

Thandel: తండేల్ నుంచి ‘హైలెస్సో.. హైలెస్సా’.. మరో క్రేజీ సాంగ్‌తో వచ్చేస్తున్న నాగచైతన్య, సాయిపల్లవి
X

దిశ, సినిమా: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ (Thandel). లవ్ అండ్ యాక్షన్ (Love and action) ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తుండగా... అల్లు అరవింద్ (Allu Arvind) సమర్పణలో పత్రిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. వరుస అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ‘బుజ్జితల్లి’ (Bujji thalli), ‘శివశక్తి’ సాంగ్స్‌కు సోషల్ మీడియా (Social media)లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే జోష్‌తో మూడో పాట (Third song)కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ‘ది మాస్టర్ ఆఫ్ మెలోడీస్ రాక్‌స్టార్ DSP ‘తండేల్’ కోసం మరో బ్లాక్ బస్టర్ ప్రేమ పాటతో వస్తున్నాడు. తండేల్ మూడో పాట ‘హైలెస్సో.. హైలెస్సా’ (Hilesso Hilessa) జనవరి 23న విడుదల అవుతుంది. ఈ సుందరమైన మెలోడీని శ్రేయఘోషల్ & అజీజ్ నకాష్ అలపించారు’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Next Story