- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంలో నాకు అనుభవం ఉన్నప్పటికీ కూడా వాళ్లు అలా చేసేవారు.. సమంత ఎమోషనల్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గతంలో మయోసైటీస్(Myositis) వ్యాధి బారిన పడి సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) వెబ్ సిరీస్‌తో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గతంలో మయోసైటీస్(Myositis) వ్యాధి బారిన పడి సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) వెబ్ సిరీస్‌తో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తన సొంత నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) అనే సినిమాలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో పాటు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత సినీ కెరీర్, రెమ్యూనరేషన్, మహిళల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ ఇండస్ట్రీ అనేది నా రెండో ఇల్లు లాంటిది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. దాన్ని ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకోను. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని నేనే చేస్తాను. నేను కూడా ఒక నిర్మాణ సంస్థను నడుపుతున్నాను. అక్కడ మహిళల భద్రత నా బాధ్యత.
అలాగే సినీ పరిశ్రమలో నాతో పాటు నటించిన నటుల కంటే కూడా నాకు తక్కువగానే రెమ్యునరేషన్(Remuneration) ఇచ్చేవాళ్ళు. నాకు అనుభవం ఉన్నప్పటికీ నాకు తక్కువగానే ఇచ్చేవాళ్లు. ఇది నా నిర్మాణ సంస్థలో జరగకూడదు అనుకున్నాను. నేను జెండర్ ఈక్వాలిటీ చూస్తాను. మా నిర్మాణ సంస్థలో అందరికీ ఒకే రకంగా చెల్లింపులు ఉంటాయి. నేను అనుభవించింది ఇంకో స్త్రీ అనుభవించకూడదు. మా సంస్థలో మగ, ఆడ వర్కర్స్ సమానంగా ఉండేలా చూస్తాను.
అలాగే.. ఆడవాళ్లు పెళ్లయి పిల్లలు కనడం అనేది జీవితాశయం అన్న సమాజంలో మనం ఉన్నాము. నేను అక్కడి నుంచే వచ్చాను. కానీ అది తప్పు. అది జరగకపోయినా, సమాజం చెప్పినట్టు ఆ మహిళ లేకపోయినా, ఒక మహిళ తాను చేయగలిగింది చేస్తూ సంతోషంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక దీన్ని విన్న నెటిజన్లు ఇంత మంచి మనసు ఉన్నందుకు గానూ సమంత పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.






