Salman Khan: నా ఫొటో కూడా పెట్టకుండా పెద్ద బ్రేకింగ్ న్యూస్ చేశారు.. సల్మాన్ ఖాన్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-19 07:20:06  IST  )

చుట్టూ ఎప్పుడూ జనాలు ఉండడం వల్ల కాస్త విసుగ్గా అనిపిస్తుంది. అందుకే నా కోసం కొంచెం పర్సనల్ సమయం కేటాయించుకోవాలనిపించింది అంతే!

Salman Khan: నా ఫొటో కూడా పెట్టకుండా పెద్ద బ్రేకింగ్ న్యూస్ చేశారు.. సల్మాన్ ఖాన్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అసలు ఆ పోస్ట్‌లో ఏముందంటే.. "ఒంటరిగా ఉండటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి అలోన్ , రెండోది లోన్లీ. అలోన్‌గా ఉండటం అనేది మన ఇష్టపూర్వక ఎంపిక. కానీ ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది లోన్లీనెస్. ఇక దీని తర్వాత ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి" అంటూ సల్మాన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ షేర్ చేసిన క్షణాల్లోనే ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయిపోయింది. అసలు సల్మాన్ ఖాన్‌కు ఏమైంది? ఆయన ఎందుకు అంతలా ఆందోళన చెందుతూ ఇలాంటి పోస్ట్ పెట్టారంటూ అభిమానులు, నెటిజన్లు తెగ కంగారుపడిపోయారు. ఈ నేపథ్యంలో, తన పోస్ట్‌పై వస్తున్న వార్తలకు, అభిమానుల ఆందోళనకు ఫుల్ స్టాప్ పెడుతూ సల్మాన్ ఖాన్ వివరణ ఇచ్చారు. సల్మాన్ నవ్వుతూ స్పందిస్తూ.. "అరే యార్.. నేను నా గురించి ఆ పోస్ట్ పెట్టలేదు.

అయినా ఇంత పెద్ద కుటుంబం, ఇంతమంది స్నేహితులు ఉన్నప్పుడు నేను ఎలా ఒంటరివాడిని అవుతాను? మీ అందరి ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటే, నేను ఒక్కడినే అనే భావన నాలో ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు చుట్టూ ఎప్పుడూ జనాలు ఉండడం వల్ల కాస్త విసుగ్గా అనిపిస్తుంది. అందుకే నా కోసం కొంచెం పర్సనల్ సమయం కేటాయించుకోవాలనిపించింది అంతే! కానీ దాన్ని మీరంతా బాగా హైలైట్ చేశారు. కనీసం నా ఫొటో కూడా పెట్టకుండానే కేవలం ఆ టెక్స్ట్‌తోనే దీన్ని పెద్ద బ్రేకింగ్ న్యూస్ చేసేశారు" అని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి తన తల్లి కూడా కంగారు పడిందని సల్మాన్ వెల్లడించారు. "మీరు చేసిన హడావుడి చూసి మా అమ్మ కూడా నా దగ్గరకు వచ్చి.. ‘ఏమైంది నాన్న?’ అని అడిగింది. కాబట్టి దయచేసి మీరంతా కూల్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ అంత కంగారుపడాల్సిన విషయం ఏమీ లేదు" అంటూ సల్మాన్ ఖాన్ అందరినీ రిలాక్స్ అవ్వమని కోరారు.

Next Story