- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gautam Vasudev Menon: ఎవరూ సాయం చేయలేదు. నాకు చాలా బాధగా ఉందంటూ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్
డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautam Vasudev Menon) ‘ఏ మాయ చేసావే’(Ye Maaya Chesave) సినిమాతో హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautam Vasudev Menon) ‘ఏ మాయ చేసావే’(Ye Maaya Chesave) సినిమాతో హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వెంకటేష్ ‘ఘర్షణ’(Gharshana) చేసి తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. ఇటీవల చియాన్ విక్రమ్ ‘ధృవ నక్షత్రం’(Dhruva Nakshatram) సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే 2023లో పూర్తి అయినప్పటికీ విడుదల కాలేదు. పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తుంది.
అయితే పొంగల్‌కు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మూవీ మేకర్స్‌కు నిరాశనే ఎదురైంది. మళ్లీ వాయిదా పడింది. ఈ క్రమంలో.. తాజాగా, గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘‘ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు నాకు బాధగా ఉంది. ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరూ లేరు. నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం. ఎందుకలా అంటున్నానంటే.. ‘ధృవ నక్షత్రం’ విడుదల విషయంలో సమస్యల గురించి ఎవరూ నన్ను అడగలేదు.
కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇండస్ట్రీ ఆ చిత్రాన్ని పట్టించుకోవడం లేదు. సినిమా గురించి కూడా ఎవరికీ తెలియదు. ధనుష్, లింగుస్వామి(Dhanush, Linguswamy) మాత్రమే దాని గురించి నాతో చర్చించారు. విడుదల చేయించడానికి కూడా సాయం చేశారు. కొన్ని స్టూడియోల వారికి ఈ సినిమాను చూపించాను. కానీ కొన్ని సమస్యలు ఉన్నందున ఎవరూ దాన్ని స్వీకరించలేదు. విడుదల చేయడానికి కూడా ముందుకు రాలేదు. ప్రేక్షకులు నా చిత్రాలు చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి నేను ఇంకా బతికి ఉన్నాను అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.






