చాలా నీచంగా కామెంట్స్ చేస్తున్నారు.. కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేదిలేదంటూ నమిత వార్నింగ్

by Mallepaka Hamsa |

నీ అమ్మ క్యాన్సర్‌తో చనిపోవాలి’, ‘నీ పిల్లలు, నువ్వు పెంచుకునే జంతువులు కూడా చనిపోవాలి’ అంటూ శాపనార్థాలు పెట్టారు. ఆ వ్యాఖ్యలు నన్ను మానసికంగా చాలా దెబ్బతీశాయి.

చాలా నీచంగా కామెంట్స్ చేస్తున్నారు.. కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేదిలేదంటూ నమిత వార్నింగ్
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ నమిత స్టార్ హీరోలతో నటించి బాక్సాఫీసును షేక్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ‘సొంతం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రభాస్, బాలకృష్ణ వంటి స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టాన్ని పొందింది. అయినప్పటికీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత ఎమోషనల్ కామెంట్స్ చేసింది. నమిత మాట్లాడుతూ.. "ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు నెటిజన్లు చేసిన కామెంట్లు చాలా దారుణంగా ఉన్నాయి. ‘నీ అమ్మ క్యాన్సర్‌తో చనిపోవాలి’, ‘నీ పిల్లలు, నువ్వు పెంచుకునే జంతువులు కూడా చనిపోవాలి’ అంటూ శాపనార్థాలు పెట్టారు. ఆ వ్యాఖ్యలు నన్ను మానసికంగా చాలా దెబ్బతీశాయి.

జీవితంలో మొదటిసారి అలాంటి ఘోరమైన మాటలు చదివినప్పుడు తట్టుకోలేక చాలా రోజులు ఏడ్చాను" అని ఎమోషనల్ అయ్యింది. బిగ్‌బాస్ షో గురించి స్పందిస్తూ.. "హౌస్‌లో జరిగే చిన్న చిన్న విషయాలను జనాలు చాలా ఓవర్‌గా జడ్జ్ చేస్తున్నారు. టీవీలో కనిపించే కేవలం ఒకటిన్నర గంటల ఎపిసోడ్‌ను చూసి, మా 24 గంటల రియాలిటీని, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయడం అస్సలు సరికాదు. వేరొకరిపై నెగెటివ్ కామెంట్స్ చేసే ముందు, ఒక్కసారి వారి స్థానంలో నిలబడి ఆలోచించండి. నా వరకు నేను ఎలాంటి ట్రోల్స్ అయినా భరిస్తాను కానీ, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా స్నేహితుల జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను" అంటూ నమిత గట్టి వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై జరుగుతున్న సైబర్ దాడి గురించి నమిత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story