- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asha Bhosle తెలుగులో పాడిన సూపర్ హిట్ పాటలు ఇవే
తాను పాడిన పాటలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించారు ఆశా భోస్లే.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ గాయని ఆశా భోస్లే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ప్రముఖ గాయని 2026 ఏప్రిల్ 12న ముంబై నగరంలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమె ఇప్పటివరకు ఎన్నో భాషల్లో పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా అపారమైన గుర్తింపును సంపాదించారు. అయితే ఎక్కువ శాతం హిందీ పాటలు పాడి శ్రోతలను అత్యంతగా ఆకట్టుకున్నారు. తెలుగులో కూడా ఈ ఫేమస్ సింగర్ కొన్ని సూపర్ హిట్ పాటలు పాడారు. మరి తెలుగులో ఆశా భోస్లే పాడిన సూపర్ హిట్ సాంగ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1981లో విడుదలైన 'పాలు నీళ్లు' చిత్రంలో 'ఇది మౌన గీతం' అనే పాటను ఆశా భోస్లే పాడారు. ఈ పాటకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇదే ఈమె తెలుగులో పాడిన మొదటి పాట.
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన 'అశ్వమేధం' చిత్రంలో 'సీతాకాలం ప్రేమకు ఎండాకాలం' అనే పాటను పాడారు. 1992లో విడుదలైన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.
'సాంప్రదాయం' చిత్రంలో 'అందమైన వెన్నెలలో' అనే పాటను పాడారు.
'ప్రేమ లేఖలు' చిత్రంలో 'కొత్తగా ఉన్నది' అనే పాటను ఆలపించారు.
'ప్రేమికుడు ప్రేమంటే తెలుసా' చిత్రంలో 'జల్లండి మది' అనే పాటను పాడారు.
'ఇద్దరు' చిత్రంలో 'వెన్నెల' అనే పాటను ఆలపించారు.
కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'చందమామ' చిత్రంలో 'నాలో ఊహలకు' అనే పాటను పాడి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇలా ఆశా భోస్లే తన మధుర స్వరంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతోగానో అలరించారు. ఆమె పాడిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.






