- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లవర్స్ డే స్పెషల్‌గా రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.. ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏది..?
సాధారణంగా ప్రతి పండుగకు కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి.

దిశ, సినిమా: సాధారణంగా ప్రతి పండుగకు కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి. సెలవులు కావడం వల్ల ప్రేక్షకులు కూడా ఈ టైంలో ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి, దసరా, దీపావళి, ఉగాది ఫెస్టివల్స్‌కి అయితే పక్కాగా కొన్ని చిత్రాలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందన్న సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజు సందర్భంగా కూడా ప్రజెంట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అలా ఈ ఫిబ్రవరి 14న విడుదల అయ్యే సినిమాలు వాటి వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
లైలా:
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా రామ్ నారాయణ్(Ram Narayan) డైరెక్షన్‌లో ‘లైలా’(Laila) మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది.
బ్రహ్మా ఆనందం:
‘మళ్లీ రావా’(Malli Raava), ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’(Agent Sai Srinivasa Athreya), ‘మసూద’(Masooda) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్(Swadharm Entertainments) నుంచి వస్తున్న నాలుగో సినిమా ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam). ఈ మూవీలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం(Brahmanandam), అతని కుమారుడు రాజా గౌతమ్(Raja Gowtham) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి సావిత్రి(savitri), శ్రీ ఉమేష్ కుమార్(Umesh Kumar) సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ Rvs నిఖిల్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఛావా:
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మిస్తున్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
సంకి:
అహన్ శెట్టి(Ahan Shetty), పూజా హెగ్డే(Pooja Hegde) ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ‘సంకి’(Sanki). లవ్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.
ఆరెంట్ రీ రిలీజ్:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), జెనీలియా(Genelia) జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘ఆరెంజ్’(Orange). ఈ సినిమా వాలెంటైన్ డే స్పెషల్‌గా థియేటర్లలో ఫిబ్రవరి 14న రీ రిలీజ్ కానుంది.
తల:
అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar) దర్శకత్వంలో తన తనయుడు అమ్మ రాగిన్ రాజ్(Amma Ragin Raj) తొలి పరిచయం అవుతున్న మూవీ ‘తల’(Thala). అంకిత నస్కర్(Ankitha Naskar) హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 14న రిలీజ్ కానుంది.






