- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా ప్రియులకు అలర్ట్... సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే
పవన్ కళ్యాణ్ నటించిన OG, అనుష్క నటించిన ఘాటి కూడా ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే శుభవార్త. సెప్టెంబర్ మాసంలో వరుసగా సినిమాలు రానున్నాయి. వారానికి ఒక్కటి చొప్పున దాదాపు ఆరు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ నటించిన OG, అనుష్క నటించిన ఘాటి కూడా ఉన్నాయి. వాటి రిలీజ్ డేట్స్ ఒకసారి పరిశీలిస్తే.. అనుష్క హీరోయిన్ గా నటించిన ఘాటి మూవీ సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది.
అదే రోజున శివ కార్తికేయన్, మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మదరాసి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అయితే అనుష్క ఫాలోయింగ్ కారణంగా... ఘాటి కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 12వ తేదీన బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కిష్కింద పురి రిలీజ్ కానుంది. అదే రోజున దుల్కర్ సల్మాన్ కాంత కూడా రిలీజ్ అవుతుంది.
అయితే ఈ రెండు సినిమాల నేపథ్యంలో హీరో తేజ సజ్జ నటించిన మిరాయ్ సెప్టెంబర్ 19వ తేదీకి ఫిక్స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీ సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అవుతుంది. చివరగా రవితేజ నటించిన మాస్ జాతర... సెప్టెంబర్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.






