- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tollywood: ఓకే హీరోకు తల్లిగా,భార్యగా నటించిన హీరోయిన్స్ వీళ్ళే
నిజ జీవితంలో వారి లైఫ్ చాలా వేరుగా ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. అయితే, వీరంతా సినిమా వరకు మాత్రమే సీరియస్ గా ఉంటారు.. నిజ జీవితంలో వారి లైఫ్ చాలా వేరుగా ఉంటుంది. ఇదిలా ఉండగా , ఒక్కోసారి ఒక్కరే సినిమాలోని అన్ని పాత్రలు చేస్తారు. హీరోయిన్స్ లో కొందరైతే ఒక హీరోతో హీరోయిన్ గా నటించిన కొంతకాలం తర్వాత మళ్ళీ అదే హీరోకి తల్లి పాత్రలో కూడా నటించారు. సీనియర్ హీరోయిన్ భానుమతి నుంచి ఇప్పటి అనుష్క శెట్టి వరకు ఎంతో మంది ఉన్నారు. మరి, ఆ హీరోయిన్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం
భానుమతి : భానుమతి ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా చేసింది. అలాంటి ఆమె 1992లో వచ్చిన సామ్రాట్ అశోక మూవీలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించింది.
శారద : ఈమె నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. సూపర్ స్టార్ కృష్ణ తో ఇంద్రధనస్సు లో నటించి అగ్ని కెరటాలు, రౌడీ నెంబర్ వన్ లో కృష్ణకు తల్లిగా చేసింది.
అంజలీదేవి : అక్కినేని నాగేశ్వర రావుతో చాలా సినిమాలు చేసింది. ఆ తర్వాత ఏఎన్నార్ కి తల్లిగా నటించింది.
జయసుధ : చిరంజీవితో హీరోయిన్ గా చేసి కొంతకాలం తర్వాత జయసుధ రిక్షావోడు మూవీలో చిరంజీవికి తల్లి పాత్ర చేసింది.
భానుప్రియ : జయం మనదేరా మూవీలో వెంకటేష్ కు తల్లిగా చేసి అలాగే అదే మూవీలో సీనియర్ వెంకటేష్ కు భార్యగా కూడా నటించింది.
అనుష్క శెట్టి : ఈ అమ్మడు బాహుబలి మూవీలో హీరోయిన్ గా చేసి , జూనియర్ ప్రభాస్ కి తల్లిగా చేసింది.






