మా విడాకుల విషయంలో వస్తున్నవార్తల్లో ఎలాంటి నిజం లేదు.. మౌనీ రాయ్-సూరజ్

by Mallepaka Hamsa |

మా విడాకుల విషయంలో వస్తున్నవార్తల్లో ఎలాంటి నిజం లేదు.

మా విడాకుల విషయంలో వస్తున్నవార్తల్లో ఎలాంటి నిజం లేదు.. మౌనీ రాయ్-సూరజ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ విడాకుల వ్యవహారం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి నెట్టింట రకరకాల పుకార్లు, షికారు చేస్తున్నాయి. విడాకుల తర్వాత మౌనీ రాయ్ తన భర్త నుంచి భారీ మొత్తంలో భరణం తీసుకున్నారంటూ వార్తలువస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, మౌనీ రాయ్ మాజీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ సోషల్ మీడియా ద్వారా ఓ నోట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్ట్‌ను మౌనీ రాయ్ కూడా తన ఖాతాలో రీషేర్ చేసింది. "మా విడాకుల విషయంలో వస్తున్నవార్తల్లో ఎలాంటి నిజం లేదు.

నేను మౌనీ రాయ్‌కి ఎలాంటి భరణం ఇవ్వలేదు. మా మధ్య ఎలాంటి వివాదాలు లేవు, అలాగే మా బంధం ముగియడానికి ఎలాంటి మూడో మనిషి ప్రమేయం కూడా లేదు. మేమిద్దరం కూర్చుని, ప్రశాంతంగా చర్చించుకుని పరస్పర గౌరవంతో విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాము. కేవలం ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకుంటూ తీసుకున్న నిర్ణయం ఇది. ఇది మాత్రమే నిజం, సోషల్ మీడియాలో వస్తున్న మిగతా కథనాలన్నీ కేవలం కల్పితాలు మాత్రమే" అని స్పష్టం చేశారు. ఈ కష్టసమయంలో మీడియా సంస్థలు ఎలాంటి నిజాలు తెలుసుకోకుండా, వార్తలు రాయడం చాలా అన్యాయమని సూరజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మా ప్రతిష్టను పాడు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఈ విషయంతో ఏమాత్రం సంబంధం లేని తమ అమాయక స్నేహితులను ఈ వివాదంలోకి లాగడం అస్సలు మంచి పద్ధతి కాదని అన్నారు.

Next Story