- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nushrratt Bharuccha: సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సరైన ట్రిక్కులు లేవు.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ (Bollywood) నటి నుష్రత్ భరూచా (Nushrratt Bharuccha) అందరికి సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) నటి నుష్రత్ భరూచా (Nushrratt Bharuccha) అందరికి సుపరిచితమే. 2010లో ‘తాజ్ మహాల్’ చిత్రంతో టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. 2023లో ‘ఛత్రపతి’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా నటించగా.. వివి వినాయక్ (VV Vinayak) దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలే పోయింది. ఇప్పుడు ఓ హారర్ చిత్రం(horror film)తో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది ఈ అమ్మడు. నుష్రత్ భరూచా ప్రధాన పాత్లలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛోరీ 2’ (Chori 2). విశాల్ ఫ్యూరియా (Vishal Furia) దర్శకత్వం వహిస్తున్న ఈ హిందీ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా అండ్ జాక్ డేవిస్ నిర్మిస్తున్నారు. చోరీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో నుష్రత్ భరూచాతో పాటు సోహా అలీఖాన్, గష్మీర్ మహాజని, సౌరభ గోయల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 11 నుంచి నేరుగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నుష్రత్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘కెరీర్ స్టార్టింగ్ నుంచి జానర్ ఏదైనా కథను మాత్రమే నమ్మే నటిని నేను. ఇప్పుడు తీస్తున్న ‘ఛోరీ 2’ కూడా అంతే. ఈ సినిమాలో ఒక హిట్ సాంగ్ లేదు.. అలాగే మూవీని ప్రమోట్ చేసుకోవడానికి ట్రిక్కులు లేవు. అయినా మేము కథను నమ్మే ఈ మూవీ కోసం ముందడుగు వేశాం. మంచి చిత్రం తీయడమే మా ఉద్దేశ్యం. సామాజిక సందేశంతో కూడిన స్వచ్ఛమైన హారర్ చిత్రమిది. ప్రస్తుతం బాలీవుడ్‌లో హారర్ మూవీస్‌కు మంచి డిమాండ్ (demand) ఉంది. సరైన సమయంలో ‘ఛోరీ 2’ సినిమా వస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.






