- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ది రాజాసాబ్ నుంచి క్రేజీ న్యూస్..ఏకంగా రెండు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ !
ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణంరాజు వారసత్వాన్ని అందికొచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్న

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణంరాజు వారసత్వాన్ని అందికొచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రభాస్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన ప్రభాస్, ఇటీవల ది రాజాసాబ్ సినిమా చేశారు. ఈ సినిమా జనవరి 9 తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా చేయగా ముగ్గురు హీరోయిన్లు మెరువనున్నారు.
మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ముగ్గురు హీరోయిన్లు కూడా ప్రభాస్ తో స్టెప్పులు వేయనున్నారు. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్, కామెడీ, రొమాన్స్ ఇలా మూడింటి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కీలక అప్డేట్ వచ్చింది. యూఎస్, ఏపీలో మొత్తం రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించాలని అనుకుంటున్నారట. యూఎస్ లో మొదట ప్రీ రిలీజ్ నిర్వహించి, ఆ తర్వాత విజయవాడ లేదా వైజాగ్ లో మరో ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 27వ తేదీన ఈవెంట్ ఉండే ఛాన్స్ ఉంది.






