‘స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’గా అవార్డ్ గెల్చుకున్న యంగ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

by Chukka Sudharani |   (  Updated:2024-11-30 16:27:40  IST  )

యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh).. తన నటన, అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

‘స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’గా అవార్డ్ గెల్చుకున్న యంగ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh).. తన నటన, అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా కొంత కాలం ఇండస్ట్రీకి దూరం అయినా ఈ బ్యూటీ.. చాలా గ్యాప్ తర్వాత ‘డార్లింగ్’(Darling) మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులే సొంతం చేసుకుంది. దీంతో ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. నిఖిల్(Nikhil) హీరోగా నటిస్తున్న స్వయంభు (Swayambhu)మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రీసెంట్‌గా ‘నాగబంధం’ (Nagabagndham) అనే పాన్ ఇండియా చిత్రాన్ని స్టార్ట్ చేసింది. ఇక సినిమాలతో పాటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ఈ బ్యూటీ. ఇన్‌స్టా వేదికగా తన అందాలతో కుర్రాళ్లుకు పిచ్చేక్కిస్తూ వాళ్లను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నభా ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ‘స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’(Out Look Award as Style Icon of the Year)గా ఔట్ లుక్ అవార్డ్ గెల్చుకుంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) చేతుల మీదుగా నభా ఈ అవార్డ్ తీసుకోగా.. ప్రజెంట్ ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More...

Birthday special: ‘మిమ్మల్ని దోచుకునేందుకు సిద్ధం..’ అంటూ రాశీఖన్నా కోసం స్పెషల్ పోస్ట్


Next Story