సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన యంగ్ హీరోయిన్.. వావ్ అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2024-12-12 15:50:18  IST  )

యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన యంగ్ హీరోయిన్.. వావ్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు ‘ఇస్మార్ట్ శంకర్’(iSmart Shankar) మూవీతో సూపర్ హిట్ అందుకుని తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veeramallu) సినిమాలో నటిస్తుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో రాబోతున్న ‘రాజా సాబ్’(Raja Saab) మూవీలో కూడా కనిపించనుంది. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రాబోతున్నారు.

ఈ నేపథ్యంలో.. నిధి అగర్వాల్ షూటింగ్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే యాడ్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) చీరలో మెరిసిపోతున్న ఫొటోలు షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు ఆమె ‘పెళ్లి చూపులు వైబ్స్’ అనే క్యాప్షన్ జత చేసి ఆ తర్వాత మార్చేసింది. ‘‘ప్రతిరోజు నేను ఇదే లుక్‌లో కనిపించాలా? రోజు ఇదే డ్రెస్ వేసుకోవాలా?’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు కుందనపు బొమ్మలా సూపర్ ఉన్నావ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story