- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో విలన్‌గా చేయనున్న యంగ్ హీరో.. పోస్ట్‌తో హింట్ ఇచ్చేశాడుగా!
నేచురల్ స్టార్ నాని (nani) వరుస హిట్స్ సాధిస్తూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్నారు.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (nani) వరుస హిట్స్ సాధిస్తూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవల ‘హిట్-3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఘన విజయం సాధించారు. ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని slv బ్యానర్‌పై చేరుకూరి సుధాకర్ తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో కయాదు లోహర్ (Kayadu Lohar)హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న గ్రాండ్ విడుదల కాబోతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ది ప్యారడైజ్’ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు పలు పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యానిమేటెడ్ బర్డ్ ఫొటో షేర్ చేయడంతో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌తో ‘ది ప్యారడైజ్’ మూవీలో నటిస్తున్నట్లు హింట్ ఇచ్చాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో రాఘవ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






