నా సోల్‌తో గ్రేట్ ఫుల్ ట్రిప్ అంటూ అతనితో ఉన్న ఫొటో షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by I. Sairam |

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Firzada) ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’(Krishna Gadi Veeraprema gadha) మూవీతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమయింది.

నా సోల్‌తో గ్రేట్ ఫుల్ ట్రిప్ అంటూ అతనితో ఉన్న ఫొటో షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Firzada) ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’(Krishna Gadi Veeraprema gadha) మూవీతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమయింది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటించాడు. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. అలా ‘మహానుభావుడు’(Mahanubhavudu), ‘రాజా ది గ్రేట్’(Raja The Great), ‘జవాన్’(Jawan), ‘ఎఫ్-2’(F2), ‘చాణక్యుడు’(Chanakyudu), ‘ఎంత మంచివాడవురా’(Entha Manchivadavura), ‘ఎఫ్-3’(F3) వంటి సినిమాలతో విజయం సాధించింది.

అయితే ఏమైందో ఏమో కానీ కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియా(Social Media)లో నిత్యం యాక్టీవ్‌గా ఉంటుంది. అక్కడ వేకేషన్స్, పార్టీస్ చేసుకుంటున్న ఫొటోస్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. దీంతో ఈ భామకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో ఈ చిన్నది ఏ పోస్ట్ పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది.

అలా ప్రజెంట్ పెట్టిన పోస్ట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఓ వ్యక్తితో ఉన్న ఫొటోతో పాటు తను ఎంజాయ్ చేస్తున్న తన సింగిల్ ఫొటో షేర్ చేసింది. ఇక ఈ పిక్స్‌కు.. ‘నా సోల్‌తో కొండలపై గ్రేట్ ఫుల్ ట్రిప్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story